బీరు బాటిల్‌తో దాడి.. తీవ్ర గాయాలు
కృష్ణా: మైలవరం మండలం వెల్వడం గ్రామంలో శనివారం రాత్రి కుటుంబ విభేదాల కారణంగా అన్నదమ్ముల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో అన్న, పండు అనే తమ్ముడిపై బీరుపాట్లతో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం మైలవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.