నిప్పంటించుకున్న హిజ్రాల్లో ముగ్గురి మృతి
HYD: ట్రాన్స్ జెండర్ మోనాలిసాకు వ్యతిరేకంగా ఇటీవల బోరబండ బస్టాండ్‌లో ఓ వర్గం చేపట్టిన ఆందోళన తీవ్ర విషాదంగా మారింది. ఆందోళన సమయంలో పెట్రోల్ పోసుకున్న ట్రాన్స్ జెండర్లలో చికిత్స పొందుతూ ఇవాళ నవనీత (24) గాంధీ ఆసుపత్రిలో మరణించింది. ఈ నెల 20న అప్సానా, 23న హీనా కూడా చనిపోయిన సంగతి తెలిసిందే. బోరబండ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య మూడుకు చేరింది.