వెంకటేశ్వర స్వామి దేవాలయంకి ఎమ్మెల్యే భూమి పూజ

SKLM: సనాతన సాంప్రదాయంలో దేవాలయాలు ఎంతో అవసరమని ప్రతి గ్రామంలో దేవాలయం ఉండాలని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. గార మండలం కళింగపట్నం పంచాయతీ కె. మత్స్యలేసం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి భూమి పూజ నిర్వహించారు. వేద పండితులు వేదమంత్రాలు మంగళ వాయిద్య నడుమ అర్చక బృందం ఆధ్వర్యంలో ఈ భూమి పూజ కార్యక్రమం జరిగింది.