VIDEO: టీడీపీ వారికే యూరియా: మాజీ ఎమ్మెల్యే

కృష్ణా జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా ఉందని పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. PACS వద్ద రైతులు బారులు తీరుతున్నా యూరియాను టీడీపీ వారికి మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు. రైతులు అడిగితే బెదిరింపులకు గురవుతున్నారని, రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందని ఆరోపించారు.