క్రికెట్ ఎంపిక పోటీలో ప్రారంభించిన డీఈఓ
NRML: జిల్లాలో అండర్–14 క్రికెట్ బాలుర ఎంపిక పోటీలను ఇవాళ లక్కీ క్రికెట్ అకాడమీలో జిల్లా విద్యాశాఖ అధికారి డి. భోజన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు క్రీడాలలో రాణించాలని, పోటీలో ఎంపికైన విద్యార్థులకు భవిష్యత్తులో మంచి గుర్తింపు లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.