ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్
BDK: డిసెంబర్ 2న కొత్తగూడెం ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విశ్వవిద్యాలయంలోని అన్ని విభాగాలను ఇంజనీరింగ్, R&B, అధికారులతో కలిసి పరిశీలించారు.