మెట్రో ట్రైన్‌లో మరోసారి సాంకేతిక సమస్య

మెట్రో ట్రైన్‌లో మరోసారి సాంకేతిక సమస్య

TG: హైదరాబాద్ మెట్రో ట్రైన్‌లో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. అమీర్‌పేట్-రాయదుర్గం మార్గంలో అంతరాయం ఏర్పడింది. రెండు వైపులా మెట్రో రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులకు ఇబ్బంది కలిగినట్లు తెలుస్తోంది. సాంకేతిక నిపుణులు వెంటనే మరమ్మతులు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.