స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా పనిచేయాలి: సీపీ
KMM: జిల్లాలో స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా పోలీసు సిబ్బంది పనిచేయాలని సీపీ సునీల్ దత్ అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల విధులపై బుధవారం ఖమ్మం రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అప్పగించిన భాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని, శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండాలని పోలీస్ అధికారులను సీపీ సూచించారు.