టెస్ట్ ఓటమి.. గంభీర్ బాధ్యత తీసుకోవాలి: రవి శాస్త్రి
దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో రవి శాస్త్రి కూడా దీనిపై స్పందించారు. ‘నేను గౌతీకి మద్దతుగా నిలవను. ఎందుకంటే 100 శాతం అతడు బాధ్యత తీసుకోవాలి. ఒకవేళ నేను కోచ్‌గా ఉన్నప్పుడు ఇలా జరిగి ఉంటే మొదటగా బాధ్యత తీసుకునేవాడిని’ అని మాజీ కోచ్ పేర్కొన్నాడు.