'PACS అధికారులపై చర్యలు తీసుకోండి'

'PACS అధికారులపై చర్యలు తీసుకోండి'

MHBD: తొర్రూరులోని వ్యవసాయ సహకార కేంద్రంలో యూరియా కోసం రైతులు అందించిన పాస్ బుక్, ఆధార్ జిరాక్స్‌లను బాత్రూంలో పడేసి నిర్లక్ష్యం వహించిన PACS అధికారులపై చర్యలు తీసుకోవాలని మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం యూరియా సరఫరాను పరిశీలించడానికి అక్కడికి వచ్చిన RDO గణేశ్‌ను ఆయన ఈ విషయాన్ని వివరించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.