ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు
BHPL: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా BHPL జిల్లా కేంద్రంలో ఇవాళ బీజేపీ నేతల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వజ్ర సంకల్పంతో సంస్థానాలను ఏకం చేసిన ఉక్కు మనిషి పటేల్ అని కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు ఉన్నారు.