పోలేరమ్మ జాతరలో పాల్గొన్న మంత్రి
E.G: రాజమండ్రి మారంపూడిలో గ్రామదేవత పోలేరమ్మ అమ్మవారి 12వ వార్షికోత్సవ జాతర సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి దుర్గేశ్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు మంత్రిని సత్కరించారు. జాతర సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.