VIDEO: ఒంటిమిట్టలో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
KDP: రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా 3వ రోజు ఆదివారం పలువురు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కోదండ రామాలయం ఎదుట మహిళలు కోలాటాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది.