నిత్యాన్నదాన సేవ.. 1985 నాటి ఫొటో వైరల్..!
TPT: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో 1985 ఏప్రిల్ 6న నిత్యాన్నదాన సేవలో నేటితో మరో ఏడాది పూర్తి చేసుకుంది. 4 దశాబ్దాల క్రితం కేవలం 2 వేల మందికి అన్న వితరణతో ప్రారంభమైన ఈ గొప్ప కార్యక్రమం నేడు రోజుకు 2.80 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే స్థాయికి చేరింది. భక్తుల భాగస్వామ్యం, అన్నప్రసాదం ట్రస్ట్ మూల నిధి ప్రస్తుతం రూ 2,500 కోట్లు దాటింది.