ఖైదీల వ్యవసాయంపై న్యాయమూర్తి సంతృప్తి

HYD: చర్లపల్లి వ్యవసాయ క్షేత్రంలో ఖైదీలు చేస్తున్న సేద్యంపై రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సామ్ కోషి సంతృప్తి వ్యక్తం చేశారు. చర్లపల్లిలోని ఓపెన్ ఎయిర్ జైలును ఆయన సందర్శించారు. జైలు పనితీరు, కార్యకలాపాలను అడిగి తెలుసుకుని ఖైదీలతో మాట్లాడారు. జైళ్ల శాఖ సంస్కరణలు ప్రశంసనీయమని, ఖైదీలు వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.