VIDEO: చేయిచేసుకున్న స్పీకర్.. స్పందించిన బాధితుడు
AP: నర్సీపట్నం జాతరలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు తనపై చేయిచేసుకున్న ఘటనపై ఎత్తుల భాస్కరరావు స్పందించాడు. డప్పు కొడుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ తన వల్ల అయ్యన్న కాలికి దెబ్బ తగిలిందని, ఆ కారణంతోనే ఆయన మందలించారని తెలిపారు. తమది ఒకే కుటుంబమని, దళితుడినని తన పేరుతో వైసీపీ రాజకీయం చేయడం సరికాదని మండిపడ్డాడు. ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపాలని ఆయన కోరాడు.