వటపత్రశాయిగా కరుణించిన కోదండ రాముడు
KDP: ఒంటిమిట్ట కోదండరామ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు ఆదివారం ఉదయం వటపత్రశాయి అలంకారంలో శ్రీ రాముడు గ్రామ పురవీధుల్లో ఊరేగారు. ఈ సందర్భంగా స్వామి వారి ఊరేగింపులో అడుగడుగునా కోలాటాలు, భజనలు, కేరళ వాయిద్యాలు అలరించాయి. స్వామి వారికి భక్తులు కాయకర్పూరం సమర్పించి భక్తిని చాటుకున్నారు. ఇవాళ సాయంత్రం సింహ వాహనంపై స్వామి వారు ఊరేగనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.