మే 15నాటికి పాఠ్యపుస్తకాలు సిద్ధం: డీఈఓ

GNTR: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మే 15 నాటికి అవసరమైన పాఠ్యపుస్తకాలను సిద్ధం చేస్తున్నట్లు డీఈఓ సీవీ రేణుక ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముద్రణ సంస్థల నుంచి జిల్లా కేంద్రంలోని పాఠ్యపుస్తక గోదాంకు వచ్చిన పుస్తకాలను మండలాలకు పంపుతున్నామని జిల్లాలో 7.50 లక్షలు పుస్తకాలు వచ్చాయన్నారు.