రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
NDL: మహానంది(M) సీతారామపురం వద్ద నిన్న అర్ధరాత్రి బైక్ ట్రాక్టర్ను ఢీకొనడంతో వెంకట కృష్ణ అనే యువకుడు మృతి చెందాడు. నంద్యాల రైల్వే స్టేషన్లో కుటుంబ సభ్యులను వదిలి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ట్రాలీని ఢీకొట్టడంతో వెంకటకృష్ణ అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.