అంతర్జాతీయ సైన్స్ ఫెస్టివల్‌కు సైన్స్ టీచర్ ఎంపిక
VKB: దోమ మండలం దాదాపూర్ ఉన్నత పాఠశాలకు చెందిన జీవశాస్త్ర ఉపాధ్యాయుడు శాంత్ కుమార్ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఈ నెల 6 నుంచి 9 వరకు చండీగఢ్‌లో జరగనున్న 'ఇండియా ఇంటర్‌నేషనల్ సైన్స్ ఫెస్టివల్' కు ఆయన ఎంపికయ్యారు. వరుసగా రెండోసారి ఈ అంతర్జాతీయ వేడుకకు ఎంపిక కావడంపై శాంత్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. పాఠశాల సిబ్బంది, స్థానికులు ఆయనకు అభినందనలు తెలిపారు.