నేడు ప్రభుత్వ కార్యాలయాలలో PGRS: కలెక్టర్
విశాఖ కలెక్టరేట్ కార్యాలయంలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం, జోనల్ కార్యాలయాల్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు స్వీకరించనున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.