పోచమ్మ తల్లి పున ప్రతిష్ట వేడుకలు
SDPT: బెజ్జంకి మండలంలోని గాగిలాపూర్ పోచమ్మ తల్లి ఆలయంలో జరిగిన పునర్ ప్రతిష్ఠ వేడుకలకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. ఏఎంసీ ఛైర్మన్ పులి కృష్ణ, రత్నాకర్ రెడ్డి, సర్పంచ్ ఎర్రల జానకిరాజు, ఉప సర్పంచ్ పద్మ గ్రామస్తులు పాల్గొన్నారు.