VIDEO: రాప్తాడు మండలంలో ఉద్రిక్తత

ATP: రాప్తాడు మండలం తలపూరులో వైసీపీ కార్యకర్తలు కొండన్న, ఎర్రమ్మ దంపతులపై దుండగులు దాడికి పాల్పడ్డారు. భూ వివాదంతోనే దాడి జరిగినట్ల సమాచారం. కర్రలతో ఇరువర్గాలు దాడికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనిపై స్పందించిన వైసీపీ, పరిటాల వర్గీయులే దాడికి పాల్పడ్డారని ఆరోపించింది. గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించారు.