అమరావతికి చట్టబద్ధ గుర్తింపు: మంత్రి
అన్నమయ్య: అమరావతికి చట్టబద్ధ గుర్తింపు లభించడం చారిత్రాత్మక ఘట్టమని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. లోక్‌సభ, రాజ్యసభల్లో ఆమోదంతో అమరావతి రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంగా మారనుందని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పం, ప్రధాని మోదీ సహకారం ఫలితమే ఈ విజయం అని అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.