అద్దంకిలో ముమ్మరంగా వాహన తనిఖీలు

అద్దంకిలో ముమ్మరంగా వాహన తనిఖీలు

ప్రకాశం: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సమీపిస్తున్న తరుణంలో పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపడుతున్నారు. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఆదివారం పట్టణంలోని భవాని సెంటర్ వద్ద ఎస్ఐ రత్నకుమారి ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.