వల్లూరమ్మ తల్లిని దర్శించుకున్న సినీ హీరో

వల్లూరమ్మ తల్లిని దర్శించుకున్న సినీ హీరో

ప్రకాశం: టంగుటూరు మండలం వల్లూరులో ఉన్న వల్లూరమ్మ దేవస్థానంలో ప్రముఖ సినిమా యాక్టర్ గోపీచంద్ దర్శించుకున్నారు. ఈ దేవస్థానంకు ఈ ప్రాంతం వచ్చినప్పుడు తప్పకుండా దర్శించుకుని తల్లి ఆశీస్సులు పొందుతానని తెలిపారు. సినిమా ప్రారంభ సమయంలో ఈ తల్లి ఆశీస్సులు తీసుకొని షూటింగ్‌లో పాల్గొంటానన్నారు. దేవస్థానం ఈవో రమేష్ గోపీచంద్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.