తాడిపత్రిలో 'కిసాన్ -అన్నదాత సుఖీభవ'

తాడిపత్రిలో 'కిసాన్ -అన్నదాత సుఖీభవ'

ATP: తాడిపత్రిలోని వ్యవసాయ కార్యాలయంలో పీఎం కిసాన్ -అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే రైతులతో కలిసి పథకానికి సంబంధించిన చెక్కును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.