నూతన సంవత్సరం కాలసూచిని ఆవిష్కరించిన కలెక్టర్, ఎస్పీ

నూతన సంవత్సరం కాలసూచిని ఆవిష్కరించిన కలెక్టర్, ఎస్పీ

ADB: జిల్లా కేంద్రంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని పరాభవ నామ సంవత్సరం కాలసూచిని ఆవిష్కరించారు. అనంతరం భక్తులకు ఉగాది పచ్చడి, గుడాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలు దృఢ సంకల్పంతో ముందుకు సాగి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.