ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి చేయాలని కోరిన ఎమ్మెల్యే
తూ.గో: ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మద్దుల సత్యనారాయణ గురువారం నియమితులయ్యారు. కొవ్వూరు టీటీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మద్దులని మర్యాద పూర్వకంగా కలిశారు. సమాజ సేవలో ఆయన మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. తనపై ఉంచిన బాధ్యతను సమర్థంగా నిర్వర్తించి ఆర్యవైశ్య సమాజ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.