బాల్యవివాహాల వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన

W.G: కిశోర వికాసం వేసవి శిక్షణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తణుకు మండలం పైడిపర్రులో బాల్యవివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి ప్రమోదకుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్న వయసులో గర్భం దాల్చడం వల్ల జీవితకాలంలో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని చెప్పారు. పునరుత్పత్తి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.