గాలివీడులో తొలకరి చినుకులు.. చల్లబడిన వాతావరణం
అన్నమయ్య: గాలివీడులో బుధవారం సాయంత్రం తొలకరి వర్షం కురిసింది.ఉదయం నుంచి మండుతున్న ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే సాయంత్రం పడిన స్వల్ప వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వర్షం తర్వాత చల్లని గాలులు వీయడంతో గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. ఎండ వేడి తగ్గడంతో ప్రజలు ఊరట పొందారు. ఈ మార్పుతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.