ధర్మవరం విద్యార్థులకు ఉచిత బ్యాంకింగ్ శిక్షణ

ధర్మవరం విద్యార్థులకు ఉచిత బ్యాంకింగ్ శిక్షణ

సత్యసాయి: విద్యార్థుల ఉపాధి కోసం ధర్మవరం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బ్యాంకింగ్ శిక్షణా కార్యక్రమాన్ని మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. గత నెలలో అర్హత పరీక్ష ద్వారా ఎంపికైన 12 మంది విద్యార్థులకు ఉచిత శిక్షణ నిమిత్తం ప్రత్యేక బస్సును మంత్రి జెండా ఊపి పంపించారు. శిక్షణకు మద్దతుగా సంస్కృతి సేవా సమితి తరపున రూ.1,83,600 చెక్కును మంత్రి అందజేశారు.