క్షయ రహిత సమాజమే లక్ష్యం: ఆర్డీవో
సత్యసాయి: ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా పుట్టపర్తిలో నిర్వహించిన అవగాహన ర్యాలీని RDO సువర్ణ జెండా ఊపి ప్రారంభించారు. 2030 నాటికి దేశాన్ని క్షయ రహితంగా మార్చడమే లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఈ ఏడాది ‘అవును.. క్షయను అంతం చేయగలం’ అనే నినాదంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యాధి లక్షణాలున్న వారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.