VIDEO: పాడైన విద్యుత్ స్తంభాలను మార్చాలని వినతి

VIDEO: పాడైన విద్యుత్ స్తంభాలను మార్చాలని వినతి

కోనసీమ: అయినవిల్లి మండలంలోని వీరవల్లి పాలెం గ్రామంలో పలుచోట్ల పాడైన విద్యుత్ స్తంభాలను విద్యుత్ శాఖ అధికారులు వెంటనే మార్చాలని ప్రజలు కోరుతున్నారు. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు వాలి ఉండడం, పడిపోయేలా ప్రమాదకరంగా ఉండడం పట్ల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఏ విధమైన ప్రమాదం జరగకముందే నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.