పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్
సూర్యాపేట: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. తొలి విడతలో 8 మండలాల 159 పంచాయతీలు, 1442 వార్డుల నామినేషన్లు 44 కేంద్రాల్లో స్వీకరించనున్నట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్ నియమాలను తూచా తప్పకుండా పాటించాలని, సమయపాలన, పోలీస్ బందోబస్తు, హెల్ప్‌డెస్క్ విషయాలు పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు.