పోలీసుల ఆత్మీయ సమ్మేళనం

NLG: జిల్లాకు చెందిన 1983 బ్యాచ్ పోలీస్ కానిస్టేబుల్స్ ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. చాలాకాలం తర్వాత కలుసుకున్న వీరు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. విధి నిర్వహణలో అసువులు బాసిన తమ తోటి ఉద్యోగుల ఆత్మశాంతి కోసం మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నజీర్, గౌసోద్దీన్, మధుసూదన్ రెడ్డి, యాదగిరి, అమృతయ్య తదితరులు పాల్గొన్నారు.