కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒకటే: ఎమ్మెల్యే
NZB: కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యవహారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని స్పష్టమైందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పీసీ గోష్ కమిషన్ పేరుతో రెండేళ్లపాటు కాలయాపన చేసిందన్నారు.