అక్క ఇంటికే కన్నం వేసిన చెల్లి
HYD: ఎన్ఎస్ఎఫ్ కాలనీకి చెందిన షేక్ నజీర్ భార్య ఫర్హీన్ బేగం ఇంట్లో 4.5 తులాల బంగారం, 50 తులాల వెండి, రూ.5వేల నగదు చోరీఅయ్యాయి. దర్యాప్తులో బాధితురాలి సొంతచెల్లెలు రుహీనా బేగం, మరోసోదరి భర్త మహ్మద్ రజాక్ దొంగతనం చేసినట్లు తేలింది. తల్లి ఇంటికి వెళ్లినప్పుడు బ్యాగులోంచి తాళాలు దొంగిలించి, తర్వాత బావతో కలిసి చోరీకి ఒడిగట్టారు.