ఎర్రబెల్లి కారును పోలీసుల తనిఖీ

వరంగల్: మాజీ మంత్రి ఎర్రబెల్లి కారును శనివారం పోలీసులు తనిఖీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ భాగంగా జాఫర్‌ఘడ్ చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే అటుగా వెళ్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు వాహనాన్ని ఆపిన పోలీసులు తనిఖీ చేశారు. అధికారులకు ఆయన పూర్తి సహకారం అందించినట్లు పేర్కొన్నారు.