సభ స్థలిలో భూమి పూజ చేసిన బీఆర్ఎస్ నాయకులు

HNK: ఎల్కతుర్తి మండల శివారులో ఈనెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ స్థలంలో నేడు రాష్ట్ర నాయకులు భూమిపూజ నిర్వహించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో నాయకులు బ్రాహ్మణులు ప్రత్యేక భూమి పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.