నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

KMM: ఖమ్మం నగరంలోని 11 కేవీ డెయిరీ ఫీడర్ విద్యుత్ లైన్ మరమ్మతుల దృష్ట్యా నేడు ఫీడర్ పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఏడీ యాదగిరి ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫీడర్ పరిధిలోని పోలీసాకాలనీ, నేతాజీనగర్, ఓల్డ్ సుడా చైర్మన్ బజార్ పరిధిలో అంతరాయం ఉంటుందని చెప్పారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.