రేపటి వాలీబాల్ టోర్నమెంట్ వాయిదా

రేపటి వాలీబాల్ టోర్నమెంట్ వాయిదా

SRD: నారాయణఖేడ్ పట్టణంలో శుక్రవారం నిర్వహించాల్సిన వాలీబాల్ బాలుర జిల్లా స్థాయి టోర్నమెంట్ వాయిదా వేసినట్లు జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలు కురుస్తున్నందున టోర్నమెంట్ వాయిదా వేసినట్లు చెప్పారు. టోర్నమెంట్ నిర్వహించే తేదీలను మళ్ళీ ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని కోరారు.