66 కేజీల విభాగంలో హరిని ప్రతిభ
AKP: నర్సీపట్నానికి చెందిన జడ్పీ బాలికల హైస్కూల్ విద్యార్థిని సఖిరెడ్డి హరిని జూనియర్ ఉమెన్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికైంది. ఏప్రిల్ 4-10 వరకు నాగపూర్‌లో జరిగే పోటీల్లో 66 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్ తరఫున పాల్గొంటుంది. విశాఖలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రథమ స్థానం సాధించి ఈ అవకాశం దక్కించుకుంది. ఈ క్రమంలో హెచ్‌ఎం మాధవి అభినందించారు.