ఏకగ్రీవంగా పీఆర్టీయూ మండల కార్యవర్గం
AKP: రాయవరం మండలం పీఆర్టీయూ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయింది. బుధవారం పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గోపీనాథ్ ఆధ్వర్యంలో పెదగుమ్ములూరు మోడల్ ప్రైమరీ స్కూల్లో జరిగిన సమావేశంలో అధ్యక్షుడిగా వీ. బాల ప్రభు కుమార్, సమన్వయకర్తగా సత్యనారాయణ, జిల్లా కార్యదర్శిగా రమేష్ ఎన్నికయ్యారు. పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.