అమరావతిలో ORR అవసరమా?: మాజీమంత్రి
AP: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పేరుతో ప్రభుత్వం నిర్భంధ భూసేకరణ చేయాలని చూస్తోందని మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ధ్వజమెత్తారు. పెద్ద పెద్ద నగరాలకు లేని ఔటర్ రింగ్ రోడ్డు అమరావతిలో అవసరమా? అని ప్రశ్నించారు. ఈ నిర్ణయాన్ని చంద్రబాబు పునః సమీక్షించుకోవాలని సూచించారు. భూములు కోల్పోవాల్సి వస్తున్న రైతులను చూస్తే గుండె తరుక్కుపోతుందన్నారు.