అస్సాం సీఎం దిష్టి బొమ్మ దహనం

BHPL: భూపాలపల్లిలో అస్సాం సీఎం హిమంత్ బిశ్వశర్మ దిష్టి బొమ్మను దహనం చేశారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలు దిష్టి బొమ్మను చెప్పులతో కొట్టి దహనం చేశారు. వెంటనే అస్సాం సీఎం మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీత రావు తదితరులు పాల్గొన్నారు.