వెల్కిచర్లకు ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం: ఎమ్మెల్యే

MBNR: భూత్పూర్ మండలంలోని వెల్కిచర్ల గ్రామంలో అంగన్వాడీ, హెల్త్ సెంటర్ నిర్మాణాల కోసం రూ.40 లక్షల నిధులతో నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుమారు కోటి రూపాయల నిధులతో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించామని,రాబోయే రోజుల్లో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేస్తామని తెలిపారు.