హైటెన్షన్ తీగల సమస్య పరిష్కారానికి ఆదేశం
VSP: దత్తసాయి నగర్ కాలనీవాసుల సమస్యపై గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పందించారు. బుధవారం గాజువాకలోని టీడీపీ కార్యాలయంలో ఆయన్ను కలిసిన కాలనీవాసులు, తమ ప్రాంతంలో వేలాడుతున్న హైటెన్షన్ విద్యుత్ తీగల సమస్యను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన పల్లా శ్రీనివాసరావు.. సంబంధిత అధికారులతో మాట్లాడి, సమస్యకు పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.