దెబ్బతిన్న రోడ్డు.. ప్రజల ఇబ్బందులు

MDK: రామాయంపేట తండా నుంచి కోనాపూర్ తండా రోడ్డును బాగు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు రామాయంపేట పట్టణం నుంచి కోనాపూర్ తండాకు వెళ్లే రోడ్డు దెబ్బతిన్నట్లు వివరించారు. దెబ్బతిన్న రోడ్డును అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. రోడ్డు దెబ్బ తినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.