ఉపాధ్యాయులు మార్గ నిర్దేశకులు: ఎమ్మెల్యే

యాదాద్రి: ఉపాధ్యాయులు సమాజానికి మార్గ నిర్దేశకులని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. రామన్నపేటలో స్థానిక లైన్స్ క్లబ్ వారు సిరిపురం గ్రామానికి చెందిన సిరిగిరెడ్డి సంజీవ రెడ్డి ఉద్యోగ విరమణ సందర్భంగా అభినందన ఉత్తమ ఉపాధ్యాయులకు గురువారం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే వీరేశం ముఖ్య అతిథిగా హాజరై వీరిని సత్కరించారు.